భారతదేశం, ఏప్రిల్ 21 -- Raaka: ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో అల్లు అర్జున్ 'రాకా' ఒకటి. రీసెంట్ గా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ తో ఈ మూవీపై హైప్ ఆకాశాన్ని తాకింది. ఈ అంచనాలను మరింత పెంచేలా రాకా మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ చేసిన కామెంట్లు తెగ వైరల్ గా మారాయి. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన మాటలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.

రాకా మ్యూజిక్ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉంటుందనే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ కామెంట్లు ఉన్నాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతను రాకా మ్యూజిక్ పై అదిరే అప్ డేట్ ఇచ్చాడు. మూవీ డైరెక్టర్ అట్లీకి ఫస్ట్ డే నుంచి కూడా సౌండ్ ట్రాక్ పై ఓ ఐడియా ఉందని సాయి పేర్కొన్నాడు.

''రాకా కోసం ఫస్ట్ డే అట్లీ అన్నను కలిసినప్పుడే ఈ మూవీ సౌండ్ ట్రాక్ ఎలా తీర్చిదిద్దాలన్న దానిపై అతని ఐడియా గ...