భారతదేశం, ఏప్రిల్ 13 -- భారతీయ సామాజిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, సమాజంలోని అట్టడుగు వర్గాలకు జ్ఞానమనే ఆయుధాన్ని అందించిన ధీశాలి ఆయన. 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించిన పూలే, నాటి సమాజంలో వేళ్లూనుకున్న కుల వివక్షపై రాజీలేని పోరాటం చేశారు.

నాటి రోజుల్లో విద్య అనేది కేవలం కొన్ని వర్గాలకే పరిమితమైన వేళ, అందరికీ చదువు కావాలని పూలే ఆకాంక్షించారు. 1848లో తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. సమాజం నుంచి ఎదురైన ఎన్నో అవమానాలు, ప్రతిఘటనలను లెక్కచేయకుండా అక్షర విప్లవానికి ఆయన పునాది వేశారు. 1875లో 'సత్యశోధక్ సమాజ్'ను స్థాపించి, సామాజిక సమానత్వం కోసం నిరంతరం శ్రమించారు.

జ్యోతిరావు పూలే రాసిన ...