భారతదేశం, మే 23 -- ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఒక విప్లవం.. ఆపిల్ ఐఫోన్ సృష్టికర్త అనగానే మనకు గుర్తొచ్చే పేరు స్టీవ్ జాబ్స్. ఆయన కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, కోట్ల మందికి స్ఫూర్తిప్రదాత. 2005లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన చేసిన ప్రసంగం నేటికీ ఇంటర్నెట్‌లో అత్యధికంగా వీక్షించే వీడియోల్లో ఒకటి. ఆ ప్రసంగంలో ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట నేటికీ ఎంతోమంది కెరీర్‌ను, జీవితాలను మార్చేస్తోంది.

"మీరు దేనినైతే ప్రేమిస్తారో, ఆ పనిని వెతకండి. ఇది మీ వృత్తికైనా, వ్యక్తిగత జీవితానికైనా వర్తిస్తుంది. మన జీవితంలో అత్యధిక భాగం వృత్తిలోనే గడిచిపోతుంది. కాబట్టి, మనసుకి నచ్చిన పనిని చేసినప్పుడే అసలైన సంతృప్తి లభిస్తుంది. మీరు చేసే పని అద్భుతంగా ఉండాలంటే, ఆ పనిని మీరు ప్రేమించాలి. అటువంటి పని ఇంకా దొరకలేదా? అయితే వెతకడం ఆపకండి. నిరంతరం అన్వేషి...