భారతదేశం, మే 18 -- Quote of the Day: "మనుషులను అంచనా వేయడంలోనే మీరు నిమగ్నమైతే, వారిని ప్రేమించడానికి మీకు సమయం ఉండదు" అని మదర్ థెరిస్సా పేర్కొన్నారు. ఈ ఒక్క మాటలో ఎంతటి లోతైన అర్థం ఉందో కదా.. నేటి సోషల్ మీడియా యుగంలో మనం ఒక వ్యక్తి వేషధారణనో, వారి మాట తీరునో చూసి చాలా త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాం. కానీ ఇలా ఎదుటివారిపై ముద్రలు వేయడం (Judging) వల్ల మన మెదడులో వారి పట్ల ఒక ప్రతికూల భావం ఏర్పడుతుంది. ఫలితంగా వారిలో ఉన్న మంచిని చూసే లేదా వారిని అర్థం చేసుకునే అవకాశాన్ని మనం చేజేతులా కోల్పోతున్నాం.

మదర్ థెరిస్సా అనగానే మనకు గుర్తొచ్చేది కోల్‌కతా మురికివాడలు, అక్కడి అనాథలకు ఆమె చేసిన సేవ. 1910లో అప్పటి ఒట్టోమన్ సామ్రాజ్యంలో (ప్రస్తుత నార్త్ మెసిడోనియా) జన్మించిన ఆమె అసలు పేరు ఆగ్నెస్ గొంజా బొజాజియు. 18 ఏళ్ల వయసులోనే క్రైస్తవ సన్యాసినిగ...