భారతదేశం, జూలై 21 -- ప్రజాస్వామ్యంలో లేదా ఏ రకమైన పాలనలోనైనా కొందరు నాయకులు ఉన్నట్లుండి విపరీతమైన దైవభక్తిని ప్రదర్శిస్తుంటారు. పెద్ద ఎత్తున పూజలు, ఆధ్యాత్మిక ప్రచారాలు నిర్వహిస్తుంటారు. ఇది నిజంగా వారి అంతర్గత భక్తికి సంకేతమా? లేక విమర్శల నుంచి తప్పుకోవడానికి తొడుక్కున్న రాజకీయ రక్షణ కవచమా?

గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పిన మాటలు ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం ఇస్తున్నాయి. "ఒక నియంత తనకు తానుగా విపరీతమైన దైవభక్తి ఉన్నట్లు నటించాలి. పాలకుడు దైవభీతి గలవాడని ప్రజలు నమ్మితే, అతడు అన్యాయం చేస్తాడని భయపడరు. పైగా, దేవుడు అతడి వైపే ఉన్నాడని భావించి, అతడికి వ్యతిరేకంగా కుట్రలు చేయడానికి లేదా తిరగబడటానికి సైతం వెనుకాడతారు" అని అరిస్టాటిల్ పేర్కొన్నారు.

అరిస్టాటిల్ ఇక్కడ నిజమైన ఆధ్యాత్మికత గురించి మాట్లాడలేదు. ప్రజాదరణ లేని, స్వార్థంతో పాలించే నాయక...