భారతదేశం, నవంబర్ 9 -- Vinod Kapri About OTTs Rejects Pyre: సినిమా తీయడం ఒక ఎత్తైతే, దాన్ని ప్రేక్షకులకు చేర్చడం మరొక యుద్ధం. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొంది, 18 ప్రతిష్టాత్మక అవార్డులు సాధించిన ఒక మంచి చిత్రాన్ని ఓటీటీ సంస్థలు తిరస్కరిస్తే ఆ దర్శకుడి వేదన వర్ణనాతీతం.

జాతీయ అవార్డు గ్రహీత వినోద్ కాప్రి సరిగ్గా ఇలాంటి తీవ్ర ఆవేదననే ఎదుర్కొన్నారు. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీనే 'పైర్' (Pyre). ఆ సినిమా విడుదలకు థియేటర్లు, ఓటీటీల తలుపులు మూసుకుపోవడంతో ఒకానొక దశలో సినిమాలు తీయడమే మానేద్దామని ఆయన భావించారు. అన్ని ఆటంకాలనూ అధిగమించి థియేటర్లలోకి వచ్చిన పైర్ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది.

ఉత్తరాఖండ్‌లోని కుమావున్ ప్రాంత నేపథ్యంలో సాగే ఈ కథ, గ్రామాల నుంచి పట్టణాలకు పిల్లలు వెళ్లిపోయాక ఒంటరితనంతో రగిలిపోయే ఒక...