Puri Jagannath: రేపు జ్యేష్ఠ పూర్ణిమ.. 108 కలశాలతో స్వామికి మహాభిషేకం.. దీని వెనుక ఉన్న పరమార్థం ఇదే!
భారతదేశం, జూన్ 28 -- జ్యేష్ఠ పౌర్ణమి వేళ పూరీ జగన్నాథ క్షేత్రం భక్తజన సంద్రమవుతుంది. జగన్నాథుడి రథయాత్రకు నాంది పలికే అత్యంత పవిత్రమైన 'స్నాన యాత్ర' విశేషాలు, ఆ 15 రోజుల ఏకాంతవాసం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనం ఇక్కడ తెలుసుకోండి.
జ్యేష్ఠ పౌర్ణమి రోజున పూరీ జగన్నాథ ఆలయంలో జరిగే దృశ్యం కనుల విందుగా ఉంటుంది. స్వయంగా జగన్నాథ స్వామి, బలభద్రుడు మరియు సుభద్రా దేవి భక్తులకు స్నాన మండపంపై దర్శనమిస్తారు. పవిత్ర జలాలను 108 బంగారు కలశాల్లో నింపుతారు. ఆ జలాలకు సుగంధ ద్రవ్యాలు, మూలికలను కలిపి స్వామివార్లకు మహాభిషేకం నిర్వహిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకుంటారు.
మహాస్నానం పూర్తయిన తర్వాత, స్వామివారు గజవేషంలో భక్తులకు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం, గణేశుడి భక్తుడైన ఒక పండితుడి కోరిక మేరకు, స్వామి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.