భారతదేశం, ఆగస్టు 14 -- Priyanka Chopra Released Sridevi Biography Book Cover Page: భారతీయ చిత్రసీమలో చెరగని ముద్ర వేసిన స్టార్ హీరోయిన్, దివంగత నటి శ్రీదేవి ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం, ఆమె నటనా వైభవంపై రూపుదిద్దుకుంటున్న జీవిత చరిత్ర 'ఎంప్రెస్: ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి' (Empress: The Definitive Biography of Sridevi) పుస్తక కవర్ పేజీని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఆవిష్కరించారు.

శ్రీదేవి జయంతిని పురస్కరించుకుని ఈ ప్రత్యేక కవర్ పేజీని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "సాటిలేని ఏకైక నటి శ్రీదేవి. మీ లోటు ఎప్పటికీ తీర్చలేనిది. శ్రీదేవికి స్వర్గీయ జయంతి శుభాకాంక్షలు. 'ఎంప్రెస్' పుస్తకం త్వరలోనే రాబోతోంది" అని ప్రియాంక చోప్రా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భావోద్వేగంగా పోస్ట్ చేశారు.

ప్రముఖ రచయిత ధీరజ్ కుమార్ రాసిన ఈ పుస్తకాన్ని 'వెస...