భారతదేశం, జూలై 15 -- Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా తన భర్త, పాప్ సింగర్ నిక్ జోనస్ గురించి ఒక షాకింగ్ సీక్రెట్ బయటపెట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సెలబ్రిటీల మధ్య బ్రేకప్ అయింది, అసలు అక్కడ ఏం జరుగుతోందనే గాసిప్స్ తనకంటే ముందే నిక్ తెలుసుకుని తనకు చెప్తాడంటూ ప్రియాంక బాంబు పేల్చింది. జోనస్ బ్రదర్స్ హోస్ట్ చేసిన 'హే జోనస్' పాడ్‌కాస్ట్‌లో ఈ క్రేజీ జంట ఈ విషయాలను బయటపెట్టింది.

ఈ పాడ్‌కాస్ట్‌లో నిక్ జోనస్ మాట్లాడుతూ.. తను గత ఎనిమిదేళ్లుగా ప్రియాంకతో కలిసి ఉంటున్న టైమ్‌లో బాలీవుడ్ గాసిప్స్‌ను ఫాలో అవ్వడం బాగా అలవాటు చేసుకున్నానని నవ్వుతూ చెప్పాడు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. "ఇది అక్షరాలా నిజం, నాకంటే ఎక్కువ విషయాలు నిక్‌కే తెలుసు. నేను ఎవరికైనా మెసేజ్ చేస్తూ వాళ్ల పార్ట్‌నర్ గురించి అడిగితే.. వెంటనే నిక్ జోక్యం చేసుకుని ...