భారతదేశం, ఏప్రిల్ 5 -- సినిమా రంగంలో గత కొన్నాళ్లుగా 'స్టార్ కల్చర్' చుట్టూ ఉన్న ఒక అంశం నిర్మాతలకు, దర్శకులకు పెద్ద తలనొప్పిగా మారింది. అదే.. హీరో హీరోయిన్ల వెంట సెట్స్‌కు వచ్చే భారీ సిబ్బంది (Entourage).

మేకప్ ఆర్టిస్టులు, మేనేజర్లు, పీఆర్ హెడ్స్, ట్రైనర్లు, వంట మనుషులు.. ఇలా పదుల సంఖ్యలో సిబ్బంది షూటింగ్ స్పాట్‌లో వాలిపోతుండటంపై ప్రముఖ దర్శకుడు, కొత్త లోకా హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తండ్రి ప్రియదర్శన్ ఇప్పుడు బహిరంగంగానే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇది బాలీవుడ్‌లో జరుగుతున్న 'అత్యంత దారుణమైన విషయం' అని డైరెక్టర్ ప్రియదర్శన్ అభివర్ణించారు.

ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ప్రియదర్శన్ ఈ అంశంపై దుమ్మెత్తిపోశారు. "నిజం చెప్పాలంటే నాకు ఇది అస్సలు నచ్చదు. నలుగురు నటులు ఉంటే, వారి వెంట 40 నుంచి 60 మంది సహాయకులు ఉంటున్నారు. దీనివల్ల...