భారతదేశం, నవంబర్ 11 -- Priya Bhavani Shankar Marriage: తమిళ స్టార్ నటి, ఇరుముడి సినిమా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తన లైఫ్ లో ఓ కొత్త ఛాప్టర్ స్టార్ట్ చేసింది. ఈ భామ సైలెంట్ గా ఇవాళ (నవంబర్ 11) పెళ్లి చేసుకుంది. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ వేల్ తో ఆమె వివాహం బుధవారం పొద్దున చెన్నైలో జరిగింది.

సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటుల పెళ్లిళ్లంటే ఉండే హడావుడి వేరు. ఆ హైప్, బజ్ వేరే లెవల్. కానీ ప్రియా భవానీ శంకర్ మాత్రం చాలా సింపుల్ గా తన మ్యారేజీ చేసుకుంది. ఇవాళ ఉదయం చెన్నైలోనే తన బాయ్ ఫ్రెండ్ రాజ్ వేల్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ ఏడడుగులు నడిచింది.

ప్రియా భవానీ శంకర్ పెళ్లి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. నెటిజన్లు ఈ కొత్త దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇరుముడి హీరోయిన్ పెళ్లి చేసుకుందంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. దీ...