భారతదేశం, ఆగస్టు 8 -- రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను ఆయా పాఠశాలల్లో తరగతుల వారీగా వసూలు చేస్తున్న ఫీజు వివరాలను వెంటనే నోటీస్ బోర్డుల్లో, పాఠశాల అధికారిక వెబ్‌సైట్లతో పాటు విద్యాశాఖ పోర్టల్‌లో బహిరంగంగా ప్రదర్శించాలని ప్రైవేట్ యాజమాన్యాలను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

పాఠశాల విద్యాశాఖ పరిధిలోని అన్ని ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ విద్యాసంస్థలు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆయన కోరారు. స్కూల్ నోటీస్ బోర్డు, సొంత వెబ్‌సైట్‌తో పాటు విద్యాశాఖకు చెందిన అధికారిక పోర్టల్ "schooledu.telangana.gov.in" లో ఫీజుల సమగ్ర...