భారతదేశం, జూన్ 13 -- Prime Video Web Series: డిజిటల్ స్క్రీన్‌పై వినూత్నమైన గ్రామీణ కథలతో ప్రేక్షకులను అలరించే 'ది వైరల్ ఫీవర్' (TVF) సంస్థ వరుస సర్‌ప్రైజ్‌లతో దూసుకుపోతోంది. ఇటీవలే 'ది పిరమిడ్ స్కీమ్'తో మెప్పించిన ఈ మేకర్స్.. ఇప్పుడు 'గ్రామ చికిత్సాలయ్' సీజన్ 2తో మన ముందుకు వచ్చేస్తున్నారు.

తాజాగా విడుదలైన ఈ కామెడీ డ్రామా సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచడమే కాకుండా.. కథలో దాగి ఉన్న పలు ఆసక్తికరమైన ఎలిమెంట్స్ ను పరిచయం చేసింది.

'గ్రామ చికిత్సాలయ్' సీజన్ 2లో నటుడు అమోల్ పరాశర్ మళ్లీ డాక్టర్ ప్రభాత్ పాత్రలో మెరిశారు. భఠ్‌కండీ గ్రామంలోని అధ్వాన్నపు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని (PHC) బాగుచేసి, దానికి పూర్వ వైభవం తీసుకురావడమే ఆయన మెయిన్ టార్గెట్. ఇందుకోసం ఆయన ఎంతో శ్రమిస్తారు. అయితే స్థానిక ప్రజలకు అందాల్సిన ఉచిత మందులు బయటి వ్య...