భారతదేశం, ఏప్రిల్ 25 -- Prime Video: ప్రైమ్ వీడియో తన పాపులర్ సూపర్ హీరో డ్రామా 'ది బాయ్స్' స్పిన్-ఆఫ్ సిరీస్ అయిన 'జెన్ వి' (Gen V)కి ముగింపు పలికింది. కేవలం రెండు సీజన్ల తర్వాత ఈ సిరీస్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గాడోల్కిన్ యూనివర్సిటీ నేపథ్యంలో సాగే ఈ యువ సూపర్ హీరోల కథ ఇకపై సిరీస్‌గా కొనసాగదు.

జెన్ వి సిరీస్ రెండో సీజన్ అక్టోబర్ 2025లో ఓటీటీలో అదరగొట్టింది. ఆ తర్వాత ఆరు నెలలకు ఇప్పుడు ఈ సిరీస్ కు ఎండ్ కార్డు వేస్తున్నట్లు ప్రైమ్ వీడియో ప్రకటించడం గమనార్హం.

"గాడోల్కిన్‌లో ఈ ప్రయాణాన్ని మరో సీజన్ కొనసాగించాలని మాకూ ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి దీన్ని ముగిస్తున్నాం. అయితే 'జెన్ వి'లోని కీలక పాత్రలు 'ది బాయ్స్' సీజన్ 5లోనూ, ఇతర వోట్ సినిమాటిక్ యూనివర్స్ (VCU) ప్రాజెక్టులలోనూ కనిపిస్తాయి" అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...