భారతదేశం, ఆగస్టు 15 -- Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి గత నెల చివరి వారంలో వచ్చిన 'ఆదర్శ్ బాల్ విద్యాలయ' వెబ్ సిరీస్ ఓటీటీ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన కేవలం మూడు వారాల్లోనే ఏకంగా సీజన్ 2 తో పాటు సీజన్ 3లను ఒకేసారి అనౌన్స్ చేసి ప్రైమ్ వీడియో డిజిటల్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఏ ప్లాట్‌ఫామ్ అయినా ఒక సీజన్ సక్సెస్ అయ్యాక నెలల తరబడి విశ్లేషించి నెక్స్ట్ సీజన్ గురించి ఆలోచిస్తుంది. కానీ ఈ సిరీస్ సాధించిన గ్లోబల్ రికార్డులు చూసి మేకర్స్ ఒకేసారి రెండు సీజన్లకు పచ్చజెండా ఊపేశారు.

ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఒకేసారి రెండు సీజన్లను రెనివల్ చేయడం డిజిటల్ కంటెంట్ రంగంలో చాలా అరుదుగా జరిగే సంఘటన. ఈ ఆదర్శ్ బాల్ విద్యాలయ వెబ్ సిరీస్ విషయంలో ప్రైమ్ వీడియో ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి....