భారతదేశం, అక్టోబర్ 26 -- Prime Video: పండుగ సీజన్ ముగిసినప్పటికీ ఓటీటీ ప్రియులకు వినోదం మాత్రం అస్సలు తగ్గడం లేదు. ముఖ్యంగా ఇండియాలో అత్యధిక యూజర్లు కలిగి ఉన్న ప్రముఖ డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల తాజా జాబితాను అధికారికంగా వెల్లడించింది.

థ్రిల్లర్లు, రియాలిటీ షోలు, మాస్ యాక్షన్ డ్రామాలు, డార్క్ కామెడీలతో నిండిన ఈ వారం 'టాప్ 10 ఇన్ ఇండియా' జాబితాలో ఏయే సినిమాలు ఏ స్థానాల్లో ట్రెండ్ అవుతున్నాయో పూర్తి వివరాలతో తెలుసుకుందాం.

ఇండియన్ ఓటీటీ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న పాపులర్ డ్రామా రియాలిటీ సిరీస్ 'రైజ్ అండ్ ఫాల్ 2' ప్రైమ్‌ వీడియోలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్లతో ప్రసారమవుతున్న ఈ షోకి.. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ హోస...