భారతదేశం, మే 7 -- Amazon Prime MX Player OTT Unification: భారతీయ ఓటీటీ రంగంలో పెను మార్పు చోటుచేసుకోనుంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో, తన అనుబంధ సంస్థ అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ (MX Player)ను పూర్తిగా తనలో విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీనివల్ల భారతీయ ప్రేక్షకులకు అతిపెద్ద కంటెంట్ ఓటీటీ లైబ్రరీ అందుబాటులోకి రానుంది.

రెండు ఏళ్ల క్రితం ఎమ్ఎక్స్ ప్లేయర్‌ను అమెజాన్ దక్కించుకున్నప్పటి నుంచే ఈ మార్పులకు పునాది పడింది. తాజాగా గురువారం (మే 7) నాడు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ఈ ఓటీటీ విలీనాన్ని ధృవీకరించింది. ఇప్పుడు ప్రైమ్ వీడియో, ఎమ్ఎక్స్ ప్లేయర్‌లు ఒకే గొడుగు కిందకు రావడం వల్ల ఉచిత, పెయిడ్ కంటెంట్ రెండూ ఒకే చోట లభిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఓటీటీ ప్రేక్షకుడికి నాణ్యమైన వినోదాన్ని అందించే 'వన్-స్టాప...