భారతదేశం, ఆగస్టు 18 -- Premalu OTT: మలయాళంలో సంచలన విజయం సాధించిన లవ్, కామెడీ ఎంటర్‌టైనర్ 'ప్రేమలు' (Premalu) మూవీ ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా హిందీ రీమేక్ 'ప్రేమ్ కీటాను' (Prem Keetanu) ట్రైలర్ రిలీజైన కొద్ది గంటల్లోనే ఒరిజినల్ వర్షన్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి సడన్‌గా తొలగించారు. దీంతో నెటిజన్లు, సినీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌లో వీర్ పహారియా హీరోగా 'ప్రేమ్ కీటాను' పేరుతో ప్రేమలు మూవీ రీమేక్ నిర్మించారు. అపూర్వ్ సింగ్ కర్కీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ నెటిజన్లను అస్సలు ఆకట్టుకోలేకపోయింది. అసలు కథలోని సోల్‌ను పక్కన పెట్టేసి రీమేక్ పేరుతో రూపురేఖలు మార్చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇది చాలదన్నట్లు, ట్రైలర్ వచ్చిన వెంటే జియోహ...