భారతదేశం, మే 30 -- Premalu 2: మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చి సౌత్ ఇండియాలోనే కాకుండా, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యూత్‌ఫుల్ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్ ప్రేమలు. నస్లేన్, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో దర్శకుడు గిరీష్ ఏ.డీ. తెరకెక్కించిన ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఈ బ్లాక్‌బస్టర్ విజయంతో మేకర్స్ ప్రేమలు సీక్వెల్‌ను కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందంటూ వస్తున్న వార్తలపై తాజాగా హీరో నస్లేన్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. అభిమానులకు షాక్ ఇస్తూ ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు స్పష్టం చేశాడు.

గతంలో ప్రేమలు 2 సినిమా ఆలస్యం అవ్వడానికి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని నిర్మాతలలో ఒకరైన దిలీష్ పోతన్ పేర్కొన్నారు. కానీ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ...