భారతదేశం, జూన్ 9 -- Prema Diarylo Chivari Pageelu Shooting Completed: ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో టాలీవుడ్ స్క్రీన్‌పైకి ఓ బ్యూటిఫుల్ మూవీ రానుంది. పి.వి. అర్జున్ యాదవ్ - అదితి జంట‌గా నటించిన సినిమా 'ప్రేమ డైరీలో చివ‌రి పేజీలు'.

శ్రీ ప్రసన్న హనుమాన్ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.వి. నరసింహ యాదవ్ నిర్మాణంలో, హరికృష్ణ పామంజి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ప్రేమ డైరీలో చివరి పేజీలు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలకు ముస్తాబవుతోంది.

ప్రముఖ ఆడియో సంస్థ మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఇప్పటికే విడుదలైన ప్రేమ డైరీలో చివరి పేజీలు చిత్రంలోని లిరికల్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అర్మాన్ మెరుగు అందించిన మెలోడీ ట్యూన్స్, క్యాచీ లిరిక్స్ సంగీత ప్రియులను అలరిస్తూ, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయ...