భారతదేశం, అక్టోబర్ 22 -- గర్భం దాల్చిన క్షణం నుంచి మహిళల జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆసుపత్రి పరీక్షలు, రక్త పరీక్షలు, స్కాన్లు, ప్రత్యేక ఆహార నియమాలు, వ్యాయామాలు.. ఇలా ప్రతీ విషయాన్నీ సరిగ్గా చేయాలనే ఆరాటంలో చాలా మంది తల్లులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి, అలసటకు గురవుతుంటారు. అయితే, కనిపించిన ప్రతీ సలహానూ పాటించాల్సిన అవసరం లేదని, ప్రాథమిక ఆరోగ్య సూత్రాలపై దృష్టి పెడితే చాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

"ఈ ప్రయాణంలో ప్రతీ విషయంలోనూ పర్‌ఫెక్ట్‌గా ఉండాలని ప్రయత్నించడం వల్ల మానసిక అలసట పెరుగుతుంది. దానికి బదులు తల్లి, బిడ్డ ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన కొన్ని ప్రాథమిక అలవాట్లను పాటిస్తే సరిపోతుంది," అని పూణెలోని మదర్‌హుడ్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ స్త్రీవైద్య నిపుణులు డాక్టర్ రాఖీ వాఘ్ వెల్లడించారు.

గర్భధారణ సమయంలో వైద్య...