భారతదేశం, మార్చి 30 -- ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అతని తల్లి సువర్ణలత కన్నుమూశారు. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఎక్స్ అకౌంట్‌లో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 86 ఏళ్ల వయసున్న సువర్ణలత గత కొంతకాలంగా వయసు పైబడటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఈ వార్త విన్న వెంటనే పవన్ కళ్యాణ్ తన ఎక్స్ అకౌంట్‌లో స్పందిస్తూ.. "ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత గారు శివైక్యం చెందారనే విషయం తెలిసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగంతో బాధపడుతున్న ప్రకాష్ రాజ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని రాసుకొచ్చారు.

అలాగే మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన...