భారతదేశం, జూలై 11 -- Prakash Raj Get Bail From Bengaluru Court: వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్‌కు ఎన్నికల అఫిడవిట్ వివాదంలో పెద్ద ఊరట లభించింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఒకేసారి మూడు రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉండి, ఆ సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో దాచారనే ఆరోపణలపై బెంగళూరు కోర్టు ఆయనకు శరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసు ఇప్పుడు అధికారికంగా విచారణ (ట్రయల్) దశకు చేరుకుంది. బెంగళూరులోని చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ జ్యోతి శంతప్ప కాలే ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపారు. జూలై 10వ తేదీన కోర్టుకు స్వచ్ఛందంగా హాజరైన ప్రకాష్ రాజ్‌కు మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు.

దీనికోసం ఆయన రూ. 4,000 భద్రతా డిపాజిట్ చెల్లించాలని, భవిష్యత్తులో జరిగే అన్ని కోర్టు విచారణలకు తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అంతకుముందు ప్రకాష్ ...