భారతదేశం, జూలై 12 -- Prakash Raj: ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్ మధ్య మరోసారి ట్విటర్ వార్ జోరందుకుంది. పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలా ఉన్న ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సిగ్గులేకుండా దిగజారండంటూ ప్రకాష్ రాజ్ పెట్టిన వీడియో కలకలం రేపుతోంది. దీనికి బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చాడు.

గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వాన్ని, జనసేన పార్టీని ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ప్రశ్న రావణ్ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఇవాళ (జూలై 12) ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా అకౌంట్లలో ఓ వీడియో పోస్టు చేశాడు.

ప్రకాష్ రాజ్ మరోసారి ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను, జన సైనికులను టార్గెట్ చేశాడు. ''నేను మౌనంగా లేదు. అన్నీ చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ల ప్రభావంతో జన సైనికులు,...