భారతదేశం, మే 11 -- Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా ఆయన చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 'జస్ట్ ఆస్కింగ్' (#justasking) అనే హ్యాష్‌ట్యాగ్‌తో గత కొంతకాలంగా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్న ఆయన.. తాజాగా మోదీ పాలనను 'అట్టర్ ఫ్లాప్' గా అభివర్ణిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. నోట్ల రద్దు (డెమోనిటైజేషన్) నిర్ణయం వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని, పైగా వ్యవస్థను అది నాశనం చేసిందని ఆయన విమర్శించారు.

కరోనా సమయంలో ప్రజలను పళ్ళాలు కొట్టమని, చప్పట్లు కొట్టమని చెప్పిన తీరును ఎద్దేవా చేస్తూ.. "గో కోవిడ్ గో" అంటూ నినాదాలు చేయించడం వెనుక ఉన్న తర్కాన్న...