భారతదేశం, అక్టోబర్ 30 -- Prakash Raj: తనదైన విలక్షణమైన నటనతో వందలాది పాత్రలకు ప్రాణం పోసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రకాష్ రాజ్. వెండితెరపై నటుడిగానే కాకుండా, బయట సమాజంలో జరిగే అనేక రాజకీయ, సామాజిక అంశాలపై ధైర్యంగా మాట్లాడే అతికొద్దిమంది ప్రముఖులలో ఆయన ఒకరు. సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ చేసే వ్యాఖ్యలు, విమర్శలు తరచుగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతుంటాయి.

అయితే ఆయన అంత ముక్కుసూటిగా మాట్లాడటం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? దానివల్ల ఆయన కెరీర్ కు ఎలాంటి ఇబ్బందులు కలిగాయి? అనే విషయాలపై ప్రకాష్ రాజ్ భార్య, ప్రముఖ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ (Pony Varma) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు భావోద్వేగ విషయాలను పంచుకున్నారు.

నిజాయితీగా మాట్లాడటం వల్ల ఇండస్ట్రీలో అనేక యాడ్స్, సినిమా అవకాశాలు పోయినా, ఆర్థికంగా నష్టపోయినా ఆయన తన గొంతును వినిపిస్తూనే ఉన్నారని...