భారతదేశం, జూన్ 12 -- Prabhas In Mahesh Babu Varanasi As Parashurama Video: తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోలైన రెబెల్ స్టార్ ప్రభాస్, సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. వీరిద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తే చూడాలని ప్రతి సినీ అభిమానికి ఉంటుంది.

మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ రావడం ఖాయం. అయితే, నిజ జీవితంలో ఈ కలయిక ఎప్పుడు సాధ్యమవుతుందో తెలియదు కానీ, సోషల్ మీడియా ప్రపంచంలో మాత్రం అభిమానులు తమ ఊహాశక్తికి పదును పెట్టి సరికొత్త విజువల్స్ సృష్టిస్తున్నారు.

తాజాగా వారణాసి పుణ్యక్షేత్రం నేపథ్యంలో వీరిద్దరూ పౌరాణిక పాత్రల్లో ఎదురెదురుపడిన ఒక ఫ్యాన్ మేడ్ గ్లింప్స్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దాన్ని ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కుస్తున్న ...