భారతదేశం, అక్టోబర్ 14 -- Prabhas Imanvi: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఆన్ స్క్రీన్‌పై ఎంత మాస్ యాక్షన్ హీరోగా అదరగొడతారో, రియల్ లైఫ్‌లో తన తోటి నటీనటులకు, కో-స్టార్స్‌కు అంతకంటే ఎక్కువగా ఆప్యాయతను పంచుతుంటారు. తాజాగా ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'ఫౌజీ' (Fauzi) హీరోయిన్ ఇమాన్వి (Imanvi) పుట్టినరోజు వేడుక సందర్భంగా ప్రభాస్ అందించిన ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ఇమాన్ ఎస్మాయిల్ అసలు పేరుతో తెరవెనుక సుపరిచితురాలైన ముద్దుగుమ్మ ఇమాన్వీ.. టాలీవుడ్‌లో ఫౌజీ చిత్రంతోనే గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. తన 31వ పుట్టినరోజును జరుపుకున్న ఇమాన్వికి, ప్రభాస్ స్వయంగా ఒక అత్యంత భారీ రుచికరమైన విందును పంపి సర్ప్రైజ్ చేశారు.

ప్రభాస్ పంపిన ఆ ప్రత్యేకమైన రాయల్ ఫీస్ట్ చూసి ఆశ్చర్యపోయిన ఇమాన్వి.. ఆ టేబుల్ ఫోటో...