భారతదేశం, జూలై 3 -- Prabhas Fauzi: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' రిలీజ్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఎలాగైనా సరే ఈ ఏడాది డిసెంబర్ లోపు థియేటర్లలోకి తీసుకురావాలని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఒక స్ట్రాంగ్ డెడ్‌లైన్ పెట్టినట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫౌజీ మూవీ పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ రైట్స్ ను స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ రికార్డ్ ధరకు దక్కించుకుందట. అయితే ఈ అగ్రిమెంట్ లో సినిమాను కచ్చితంగా ఈ క్యాలెండర్ ఇయర్ పూర్తయ్యేలోపే రిలీజ్ చేయాలనే ఒక కఠినమైన కండిషన్ ఉన్నట్లు సమాచారం. ఒకవేళ డిసెంబర్ నాటికి ఫౌజీ థియేటర్లలోకి రాకపోతే ఆ నెట్‌ఫ్లిక్...