భారతదేశం, ఏప్రిల్ 24 -- Prabhas Fan Assaulted At Darling Re Release Theatre: ప్రస్తుతం టాలీవుడ్లో కొత్త సినిమాల సందడి కాస్త తగ్గడంతో, 2010లో ప్రభాస్-కాజల్ అగర్వాల్ జంటగా నటించిన క్లాసిక్ హిట్ 'డార్లింగ్' చిత్రాన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి థియేటర్లకు వచ్చిన ఫ్యాన్స్‌కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లోని ఒక మల్టీప్లెక్స్‌లో సినిమా ముగిసిన తర్వాత ప్రభాస్ అభిమానిని థియేటర్ సిబ్బంది విచక్షణారహితంగా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో తెల్ల చొక్కా ధరించిన ఒక యువకుడిని నీలిరంగు యూనిఫాంలో ఉన్న థియేటర్ సిబ్బంది చుట్టుముట్టి కొడుతున్నట్లు కనిపిస్తోంది. మహిళా సిబ్బంది సైతం ఆ యువకుడిని బయటకు వెళ్లాలని గట్టిగా కేకలు వేస్తూ, చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా ఉంది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.