భారతదేశం, ఆగస్టు 21 -- Prabhas: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ చూసి బాలీవుడ్ వర్గాలు షాక్ అవుతుంటే, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇస్తున్న 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' ట్యాగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ పవర్‌ఫుల్ బిరుదుపై నార్త్ నెటిజన్లు, బాలీవుడ్ స్టార్స్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టినా సందీప్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. అసలు ఈ ట్యాగ్ గురించి చెప్పినప్పుడు ప్రభాస్ ఎంత కూల్‌గా రియాక్ట్ అయ్యాడో ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా సీక్రెట్ బయటపెట్టేశారు.

'బాహుబలి' ఫ్రాంచైజ్‌తో భారతీయ సినిమా స్టాండర్డ్స్ మార్చేసిన ప్రభాస్.. రీసెంట్‌గా వచ్చిన 'సలార్', 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్ల కలెక్షన్ల సునామీ సృష్టించారు. సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని భాషల్లోనూ ప్రభాస్ కలెక్షన్ల రికార్డు...