భారతదేశం, జూలై 7 -- Prabhas: రెండేళ్ల కిందట కల్కి 2898 ఏడీ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను చూసి 'జోకర్' లా ఉన్నాడంటూ నోరు జారిన బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ ఎట్టకేలకు సైలెంట్ అయిపోయాడు. ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఊహించని రేంజ్ ట్రోలింగ్, టాలీవుడ్ హీరోల నుంచి ఎదురైన కౌంటర్ల దెబ్బకు తాను ఇప్పుడు పూర్తిగా మారిపోయానంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఎవరి ముందూ నోరు విప్పాలంటేనే భయమేస్తోందని క్లారిటీ ఇచ్చాడు.

కల్కి 2898 ఏడీ వివాదం తర్వాత తన లైఫ్ లో వచ్చిన మార్పుల గురించి న్యూస్ 18 కి ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో అర్షద్ ఓపెన్ అయ్యాడు.

"ఈ ట్రోలింగ్ ఎఫెక్ట్ తో నా మీద నేను 'సెల్ఫ్ సెన్సార్ షిప్' విధించుకున్నాను. ఇప్పుడు కేవలం నాకు బాగా తెలిసిన వాళ్లు, క్లోజ్ ఫ్రెండ్స్ తో మాత్రమే జోక్స్ వేస్తున్నాను. తెలియని వాళ్ల ముందు అసలు నోరు విప...