భారతదేశం, జూలై 6 -- Pradeep Ranganathan PR Show Launch: రచయితగా, దర్శకుడిగా, హీరోగా తక్కువ కాలంలోనే సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్. 'కోమాలి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే' చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను హీరోగా విపరీతంగా ఆకట్టుకున్నాడు.

అలాంటి హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు సరికొత్త అవతారమెత్తారు. నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ పీఆర్ షో (PR Show) అనే కొత్త ప్రొడక్షన్ బ్యానర్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ బ్యానర్‌లో రానున్న మొదటి సినిమాకు సంబంధించిన క్రేజీ అనౌన్స్‌మెంట్ వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

సినిమా ఇండస్ట్రీలో ఒక వైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు కథలు రాస్తూ బిజీగా ఉన్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు చిత్ర నిర్మాణంలోకి రావ...