భారతదేశం, అక్టోబర్ 13 -- పిల్లల పెంపకం, ఉన్నత విద్య, వివాహం, ఆస్తి కొనుగోలు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ముందస్తు ప్రణాళిక ఎంతో అవసరం. ఇందులో భాగంగానే చాలా మంది రిస్క్​-ఫ్రీ ఇన్వెస్ట్​మెంట్స్​ గురించి చూస్తుంటారు. మార్కెట్ నష్టభయం లేని సురక్షితమైన కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్). గ్యారెంటీ రాబడిని అందించే ఈ పథకం ద్వారా పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయడమే కాకుండా, కాంపౌండింగ్ శక్తిన ఉపయోగించి వారిని కోటీశ్వరులుగా మార్చే అవకాశం ఉంది.

భారతదేశంలోని ఏ పోస్టాఫీసు లేదా ప్రముఖ బ్యాంక్ శాఖలోనైనా సులభంగా పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించవచ్చు. మైనర్ పిల్లల పేరిట తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు ఖాతాను తెరిచి నిర్వహించవచ్చు. చిన్నారికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ ఖాతాను మేజర్ ఖాతాగా మార్చాల్సి ఉంటుంది. ఆదాయపు...