భారతదేశం, ఏప్రిల్ 16 -- Power Peta: రక్తంతో తడిసిన చెస్ బోర్డు, పావులు.. మధ్యలో ఎర్ర గులాబీ.. ఇలా సందీప్ కిషన్ కొత్త సినిమా పోస్టర్ ను పవర్ ఫుల్ గా రివీల్ చేశారు మేకర్స్. ఈ మూవీకి 'పవర్ పేట' అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. సందీప్ కిషన్ సినిమాల్లోకి వచ్చి 16 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇవాళ ఈ టైటిల్ ను అనౌన్స్ చేశారు.

సందీప్ కిషన్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'పవర్ పేట'. ఈ మూవీ టైటిల్ ను గురువారం (ఏప్రిల్ 16) అనౌన్స్ చేశారు.

''16 ఏళ్ల సినిమా, మీ ప్రేమ, రక్తం, పట్టుదల. ప్రతి అడుగుకు, ప్రతి పాఠానికి, మీరు నాకిచ్చిన ప్రతి ప్రేమకు రుణపడి ఉన్నా. ఇది నా తర్వాతి ఛాప్టర్.. పవర్ పేట. ఇది ప్రేమ, గౌరవం, రాజకీయాలకు సంబంధించిన స్టోరీ. ఎప్పటిలాగే మీ ప్రేమ కావాలి'' అని సందీప్ కిషన్ ఎక్స్ లో పోస్టు పెట్టాడు.

పవర్ పేట టైటిల్ పై ఎప్పటి నుంచో ప్రచార...