భారతదేశం, అక్టోబర్ 31 -- ప్రపంచవ్యాప్తంగా వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్​ మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది! దేశంలో పేదరిక నిర్మూలన దిశగా గత పుష్కర కాలంలో చేపట్టిన సంస్కరణలు, సంక్షేమ పథకాలు అద్భుతమైన ఫలితాలను అందించాయని ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో వెల్లడించింది. 2011 నుంచి 2023 మధ్య కాలంలో భారతదేశంలో ఏకంగా 49.6 కోట్ల మంది (496 మిలియన్లు) పేదరికం నుంచి బయటపడ్డారని స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పేదరికాన్ని తగ్గించిన దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని కొనియాడింది.

ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన 'ఇండియా పావర్టీ అండ్ ఈక్విటీ నివేదిక (అక్టోబర్ 2026)' వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర ఆర్థిక విధానాలు, సంక్షేమ ఫలాలు సామాన్యుడికి ...