భారతదేశం, సెప్టెంబర్ 2 -- దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు తపాలా శాఖ భారీ శుభవార్త అందించింది. వివిధ పోస్టల్ సర్కిళ్ల పరిధిలో వేలాది ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ డాక్ సేవక్ (GDS) విభాగంలో ఖాళీగా ఉన్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ నియామకాల ప్రత్యేకత ఏమిటంటే అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేదా రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఉండదు. పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగానే నేరుగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా 23,757 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా నింపనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా మంచి అవకాశాలు లభించాయి. ఆంధ్...