భారతదేశం, జూలై 16 -- Poonam Pandey: సెలబ్రిటీల పబ్లిక్ లైఫ్, పాపారాజీ కల్చర్, ఫ్యాన్ బౌండరీస్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం పూనమ్ పాండే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ ఫ్యాన్ సెల్ఫీ పేరుతో ఆమెను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించినట్లు ఆ వీడియోలో ఉంది.

ముంబైలో పూనమ్ పాండే ఎప్పటిలాగే మీడియా కెమెరాలకు ఫోజులిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక గుర్తుతెలియని వ్యక్తి సెల్ఫీ తీసుకోవాలనే సాకుతో ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. పూనమ్ అతడికి ఫోజ్ ఇస్తుండగా, ఒక్కసారిగా ఆ వ్యక్తి ఆమెను పబ్లిక్‌గా కిస్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో పూనమ్ పాండే షాక్ అయింది.

సెల్ఫీ పేరుతో వచ్చిన ఫ్యాన్ కిస్ పెట్టాలని ట్రై చేయడంతో పూనమ్ తీవ్ర అసౌకర్యానికి, ఆందోళనకు గురైంది. వెంటనే అతడిని గట్టిగా పక్కకు తోసేసింది. ఆమె ముఖంలో కనిపించిన ఆ టె...