భారతదేశం, సెప్టెంబర్ 7 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ మాధవ పెళ్లి చుట్టూ తిరిగింది. పెళ్లి విషయంలో పెద్ది ఏమాత్రం వెనక్కి తగ్గడు. దీంతో చేసేది లేక జయంతిని కలిసి మాట్లాడతారు చక్రి, మహాలక్ష్మి. అటు శైలుతో కేశవ గొడవ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గోపిక పేరు చెప్పి మహాను చక్రి మరింత ఉడికించే సీన్ తో సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 7) ఎపిసోడ్ మొదలైంది. ఇక నుంచి తాను బస్సులో కాకుండా బండిపై వెళ్తానని ఆమె అంటుంది. బస్టాప్ లో కొందరి పనులు చూడలేకపోతున్నానని చెబుతుంది.

ఇదే అదునుగా ఆమెను మరింత ఉడికించేలా చక్రి మాట్లాడతాడు. తన గోపిక తాను కనిపించకపోతే తెగ బాధపడుతుందని అంటాడు. దీంతో మహా ముఖం మరింత ఎర్రగా మారుతుంది. చక్రిపై కోపంతో బండి కిక్ రాడ్ గట్టిగా కొట్టడంతో అది స్టార్టవుతుంది. చక్రిని తిట్టి ఆమె వెళ...