భారతదేశం, నవంబర్ 7 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో మనీషా మాధవ ఇంట్లోనే ఉండిపోతుంది. తన భార్య మహా ఆమె బాస్ విక్కీతో క్లోజ్ గా ఉండటం చూసి చక్రి తట్టుకోలేకపోతాడు. మరోవైపు తన షాపులో లక్ష్మీ పూజ చేసి పేరు కూడా మార్చాలని కేశవ నిర్ణయిస్తాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి.

మాధవ, మనీషా పెళ్లి గురించి అందరూ మాట్లాడే సీన్ తో సీరియల్ శనివారం (నవంబర్ 7) ఎపిసోడ్ మొదలైంది. తమ తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోరని, వాళ్లు టిట్లాతోనే చేయాలని చూస్తున్నారని బన్సీ అంటాడు. అయితే వాళ్లను ఒప్పించే ప్రయత్నం తాను చేస్తానంటాడు. కానీ అది కుదిరే పని కాదేమో అని చక్రి అంటాడు. వాళ్లను ఒప్పించే పెళ్లి చేసుకోవాలి.. పెద్దవాళ్లను ఒప్పించకపోతే ఏం జరుగుతుందో నీ విషయంలోనే చూశాం.. ఇలా అయితే ప్రతి ఆడపిల్లా పుట్టింటికి దూరమవుతుంది అని మాధవ ...