భారతదేశం, నవంబర్ 6 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో టిట్లా మనుషుల చేతుల్లో మాధవ గాయపడతాడు. ఇంటికి వచ్చిన వాళ్లను చూసి మహా, చక్రి షాకవుతారు. ఈ సమస్యకు పరిష్కారం వాళ్ల పెళ్లే అని మహా అంటే.. బన్సీ మాత్రం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదంటూ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు.

కేశవ దగ్గరికి వచ్చి లాంగ్ డ్రైవ్ కు వెళ్దామని శైలు అడిగే సీన్ తో సీరియల్ శుక్రవారం (నవంబర్ 6) ఎపిసోడ్ మొదలైంది. తన దగ్గర బైకు లేదని, అన్నయ్య తీసుకెళ్లాడని కేశవ చెబుతాడు. ఎందుకు అని అడిగితే.. మనీషాతో లాంగ్ డ్రైవ్ కు వెళ్లాడని చెప్పడంతో శైలు షాకవుతుంది. నిన్నగాక మొన్న ప్రేమించుకోవడం మొదలు పెట్టిన వాళ్లు లాంగ్ డ్రైవ్ లకు వెళ్తున్నారు కానీ.. నువ్వు మాత్రం నన్ను తీసుకెళ్లడం లేదంటూ కేశవను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది.

సరే ఆ బైకు లేకపోతే ఏ...