భారతదేశం, నవంబర్ 4 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ మొత్తం చక్రి అడ్డదారులు తొక్కకుండా గుడిలో ప్రమాణం చేసే సీన్లతో సాగిపోయింది. మహా అతనితో ఆడుకుంటుంది. అటు గుడిలో పూజారి కూడా చక్రికి చుక్కలు చూపిస్తాడు. అయితే ఎపిసోడ్ లో చివర్లో మాధవ మారిపోయిన లుక్, మనీషా బావ వల్ల అతడు ప్రమాదంలో పడటం చూడొచ్చు.

చక్రికి 50 పర్సెంట్ టార్చర్ కంటిన్యూ అయ్యే సీన్ తో సీరియల్ బుధవారం (నవంబర్ 4) ఎపిసోడ్ మొదలైంది. మహా చెప్పడంతో అతనికి మాధవ 50 పర్సెంటే వడ్డిస్తాడు. తాను అమాయకుడినని, మీరు అనుకునేదంతా అబద్ధమని చక్రి అంటాడు. కానీ మహా వినదు. సార్ కు చాలా ఖాతాలే ఉన్నాయి అని అంటుంది. ఖాతాలంటే అని కేశవ అడిగితే.. మీకు శైలు అనే ఖాతా ఉంది కదా అలా అని మహా అనడంతో అతడు షాక్ తింటాడు.

అప్పుడే కస్టమర్ కళ్యాణి చక్రికి ఫోన్ చేస్తుంది. అతడు...