భారతదేశం, నవంబర్ 25 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో మహాను చక్రి కాపాడటం, ఆమె ఆనందంలో అతనికి హగ్ ఇవ్వడం, అతడు గాల్లో తేలిపోవడం, అదే సమయంలో అటు విక్కీని లక్కీ దూరం పెట్టడంలాంటి సీన్లతో సాగిపోయింది. అయితే చివర్లో లక్కీ నా పిల్ల అంటూ విక్కీ నోరు జారడంతో చక్రి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది.

మహా ల్యాప్‌టాప్ కోసం చక్రి వెతికే సీన్ తో సీరియల్ బుధవారం (నవంబర్ 25) ఎపిసోడ్ మొదలైంది. ఆటో జాడ తెలియకపోవడంతో అతనికి సీసీటీవీ గుర్తుకు వస్తుంది. రోజూ ఎక్కినట్లే ఫ్రూట్ షాపు ముందే మహా ఆటో ఎక్కినట్లు తెలుసుకొని అక్కడి సీసీటీవీ ఫుటేజ్ చూడాలని అనుకుంటాడు. వెంటనే అక్కడికి వెళ్లి.. ఓనర్ ను బతిమాలి సీసీటీవీ ఫుటేజ్ చూస్తాడు. దాని ద్వారా ఆటో నంబర్ తెలుసుకుంటాడు.

ఆ నంబర్ ను తనకు తెలిసిన ఫ్రెండ్ కు ఇచ్చి ఆటో వివరాలు తెలుస...