భారతదేశం, మార్చి 23 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో.. గత వారం భారత మార్కెట్​లో విడుదల చేసిన పోకో ఎక్స్​8 ప్రో సిరీస్ అమ్మకాలు ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యాయి. అద్భుతమైన డిస్​ప్లే, భారీ బ్యాటరీ, గూగుల్ జెమిని వంటి ఏఐ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లు టెక్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటి ఫీచర్లు, ధర, ఆఫర్లు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ స్మార్ట్​ఫోన్ 6.69- ఇంచ్​ 1.5కే అమోలెడ్ డిస్​ప్లేతో వస్తుంది. ఇది 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్.

కెమెరా: వెనుకవైపు 50ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్​882 సెన్సార్, ఓఐఎస్​ సపోర్ట్), 8ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 20ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: 6,50...