భారతదేశం, ఆగస్టు 12 -- రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు అడుగులు వేసిన మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన నియోజకవర్గానికి కేటాయించాల్సిన అభివృద్ధి నిధుల విషయంలో ప్రభుత్వం తీరుపై అసంతృప్తిని వెళ్లగక్కారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మంగళవాం రోజు కామారెడ్డి జిల్లా బీర్కూరులో కార్యకర్తలు, అభిమానులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తాను అధికార పక్షంలోకి మారడం వెనుక ఎలాంటి స్వార్థం లేదని పోచారం స్పష్టం చేశారు.

"నేను మంత్రి పదవ...