భారతదేశం, మార్చి 26 -- మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను వెలికితీశారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.

ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఈ సాయాన్ని అందిస్తామని ప్రధానమంత్రి మోదీ తెలిపారు.

"మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు ...