భారతదేశం, మార్చి 21 -- సోషల్ మీడియాలో విభిన్నమైన కంటెంట్‌తో ఆకట్టుకునే యువరాజ్ దువా అనే ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ఒక వినూత్న విన్నపం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 'షుగర్ కమ్ కర్వా దో పాపా కీ' (మా నాన్నగారికి పంచదార వాడకం తగ్గించమని చెప్పండి) అనే క్యాప్షన్‌తో ఆయన ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అభ్యర్థించారు! ఈ మేరకు ఆయన పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ ప్రధాని మోదీ దృష్టిని సైతం ఆకర్షించింది.

ఈ వీడియోలో యువరాజ్ దువా చాలా భిన్నంగా ఒక విషయాన్ని వివరించారు. తన తండ్రి ప్రధాని మోదీకి వీరాభిమాని అని, ప్రధాని చెప్పే ప్రతి మాటను ఆయన ఒక "ఆదేశం"లా భావిస్తారని యువరాజ్ పేర్కొన్నారు. "ఇంట్లో వాళ్లం ఎంత మొత్తుకున్నా నాన్నగారు పంచదార తగ్గించడం లేదు. అదే మోదీ ఒక్క మాట చెబితే, నాన్నగారు తప్పకుండా ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారు," అని ఆయన విన్నవిం...