భారతదేశం, మే 11 -- Work from home Narendra Modi : పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. స్ట్రెయిట్​ ఆఫ్​ హర్ముజ్​ దిగ్బంధనం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా నిలిచిపోయి, చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ తరుణంలో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారతీయులందరికీ ఒక శక్తిమంతమైన విజ్ఞప్తి చేశారు.

"దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడమే కాదు.. ఇలాంటి సంక్షోభ సమయాల్లో బాధ్యతాయుతమైన పౌరులుగా మన విధులను నెరవేర్చడం కూడా ఒక రకమైన దేశభక్తే," అని ప్రధాని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ యుద్ధాల వల్ల తలెత్తిన సరఫరా లోటును, పెరుగుతున్న ధరలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రతి భారతీయుడు నడుం బిగించాలన...