భారతదేశం, సెప్టెంబర్ 17 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. స్వతంత్ర భారత చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు నిరంతరాయంగా ప్రధానిగా సేవలందిస్తున్న అరుదైన రికార్డు మోదీ సొంతం. మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఓవైపు బీజేపీ 'సేవా సంకల్ప్ అభియాన్' పేరుతో నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా, మరోవైపు ప్రధాని రక్షణ వ్యవస్థ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధాని మోదీ భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్​జీబీ) కంటికి రెప్పలా పర్యవేక్షిస్తుంది. మోదీ కాన్వాయ్‌లోని అత్యాధునిక, అత్యంత సురక్షితమైన వాహనాలు క్లిష్టమైన దాడులను కూడా ఎదిరించేలా రూపుదిద్దుకున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కాన్వాయ్​లోని కొన్ని అత్యాధునిక వాహనాల వివరాలను ఇక్కడ చూసేయండి..

ప్రధాని మోదీ కాన్వాయ్‌లో అత్యంత విలువైన, అభేద్యమైన వాహనం మెర్సిడెస్ మేబ్యాచ...