భారతదేశం, జూలై 30 -- దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు ప్రస్తుతం ఎదురుచూస్తున్న ప్రధాన అంశం.. 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' 24వ విడత సహాయం! ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్న ప్రతి రైతుకు ప్రతీ నాలుగు నెలలకొకసారి రూ.2,000 నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయన్న సంగతి తెలిసిందే. ఎక్కడా దళారీల ప్రసక్తి లేకుండా, ఎలాంటి కాగితాల హడావుడి లేకుండా 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్' (డీబీటీ) పద్ధతిలో ప్రభుత్వం ఈ సొమ్మును నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తోంది.

ఇప్పటికే 23వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడంతో, ఇప్పుడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడతలో రూ.2,000 ఎప్పుడు ఖాతాల్లో పడతాయి? ఆ సొమ్ము ఆగకుండా రావాలంటే మనం ముందే ఏం పూర్తి చేయాలి? అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాము..

దేశంలోని చిన్న, సన్నకా...